PM Modi Meets Virat-Anushka, Watch

  • 6 years ago
Prime Minister Narendra Modi, on Wednesday met the newly married Virat Kohli and Anushka Sharma in New Delhi. The Prime Minister congratulated them on their wedding.

వివాహా బంధంతో ఒక్కటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల జోడీ ప్రధానమంత్రి నరేంద్రమోడీని బుధవారం కలిశారు. రోమ్‌లో హనీమూన్ ముగించుకుని మంగళవారం ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే.
బుధవారం సాయంత్రం ప్రధాని మోడీని కలిసి డిసెంబర్ 21న ఢిల్లీలో జరిగే రిసెప్షన్‌కు హాజరవ్వాలని కోరారు. ప్రధాని మోడీని కలిసిన ఫోటోను ప్రధాన మంత్రి కార్యాలయం తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ సందర్భంగా విరుష్క జోడీకి శుభాకాంక్షలు తెలిపింది.
ఇటలీలోని టస్కనీ రిసార్ట్‌లో విరాట్ కోహ్లీ-అనుష్కలు డిసెంబర్ 11న వివాహం చేసుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు. డిసెంబర్ 21న బంధువులకు ఢిల్లీలో, 26న ప్రముఖులకు ముంబైలో పెళ్లి విందు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీని ఢిల్లీ విందుకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

Recommended